జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ అద్బుతమైన ఆఫర్..


జియో దెబ్బకి విలవిలలాడుతున్న టెలికం సంస్థలు ఒక్కొక్కటిగా తేరుకొని జియోకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఆఫర్లపై ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ధరల యుద్దం నడుస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రోమింగ్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. జియో మాదిరిగానే వాయిస్ కాల్స్, డేటా సేవలపై రోమింగ్ ఛార్జీలను ఎత్తివేసింది. ఎస్ఎంఎస్ లకు కూడా ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు.


అవుట్ గోయింగ్ కాల్స్ పై కూడా ఎటు వంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమలులో రానుంది. ఈ ఆఫర్ అమల్లోకి వస్తే 26 కోట్ల మంది వినియోగదారులకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. ఎయిర్ టెల్ నిర్ణయంతో ఐడియా, వోడాఫోన్ లాంటి సంస్థలపైనా ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు అక్టోబర్ నుంచి వోడాఫోన్ ఇన్ కమింగ్ కాల్స్ పై రోమింగ్ ఛార్జీలు ఎత్తివేసినప్పటికీ ఔట్ గోయింగ్ కాల్స్, డేటా సేలవలపై రోమింగ్ ఛార్జీలు అలానే ఉన్నాయి.


0 comments:

http://go.ad2up.com/afu.php?id=1017948